పల్లవి:యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే (2)ఇహమందు రక్షకా - మహి మంచి దాతవు (2)
1. పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికి (2) చాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకును (2) రాజులరాజు - ప్రభువుల ప్రభువు (2) ధరపర లోకములకు - దేవుడ వీవే (2) ధన్యుండ నీకే - ఘనమైన మహిమ (2)
2. పరమును విడచితివి - ధర కేతెంచితివి ప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివి తిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివి విరివగు నీ ప్రేమ - నరులపై చూపితివి ధర నీదే ఘనతయని - చరణముల పడుదుము
3. సంఘమందు మహిమ నీకే - సకల యుగములకు యుగమందు ప్రతి జీవి - యెహోవా యనియనున్ జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవు ఆదియంతమై నీవు - అలరారుచున్నావు యుగయుగములకు - ఘనమహిమ కలుగును