CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 91

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో

saagilapadi mrokkedamu satyamuto

Hebrews 1:4

More
Reference recording on YouTube ↗
పల్లవి:సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో (1)ఆత్మలో మన ప్రభుయేసుని - ఆ....ఆ....ఆ... - సాగిలపడి మ్రొక్కెదము (1)
1. మోషే కంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్ (2) వేషధారులను - ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము (2)
2. అహరోను కంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము
3. ఆలయముకన్న శ్రేష్ఠుడు - నిజ - ఆలయముగా తానే యుండెన్ ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము
4. యోనా కంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తన్ను అర్పించెన్ మానవులను విమోచించెన్ - ఘనపరచి మ్రొక్కెదము
5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వ - జ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము
6. రాజుల కంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్ రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము
7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము

Back to Hebron Seeyonu Geethalu