CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 866

నమ్మదగిన దేవా - నిన్న నేడు నిరతము

nammadagina devaa - ninna nedu niratamu

More
పల్లవి:నమ్మదగిన దేవా - నిన్న నేడు నిరతము (2)ఏకరీతిగ నున్న నిన్ను నేను కొలుతును (2)స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా (2)
1. వ్యాధి బాధలు కలిగిన - విడువవు నన్నెన్నడు శ్రమయు శోధన వచ్చిన - విడువవు నన్నెన్నడు ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు ఎన్నడు విడువవు
2. నా తల్లిదండ్రులు విడచిన - విడువవు నన్నెన్నడు బంధుమిత్రులు ద్వేషించిన - విడువవు నన్నెన్నడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నా ప్రభు విడువక కృప చూపెదవు
3. నా కొరకై తిరిగి వచ్చెదవు - అనాధగా నన్ను విడువవు నేను నీతో వుండుటకై మహిమ రాజ్యములో చేర్చెదవు రాజుగా చేసెదవు

Back to Hebron Seeyonu Geethalu