పల్లవి:ఆహా ఆనందమే - పరమానందమే - ప్రియ యేసు - నొనగే నాకుకొలతలేనిది - బుద్ధికందనిది - ప్రేమన్ వివరింప వీలగునా?
1. నీచ ద్రోహినైన నన్ - ప్రేమతో చేర్చుకొని పాప ఊబి నుండి సన్ - పైకి లేవనెత్తెను
2. నలిగిన రెల్లువలే - నేను విరిగెడు సమయములో నాకై విజ్ఞాపన చేసి - స్థిరపరచితివి ప్రేమతో
3. కారు చీకటివేళలో కలత చెందిన నన్ను కాచి ఓదార్చితివే - బలమైన నీ ఆత్మతో
4. నాడు ప్రాణనాధుడా - నిన్నెప్పుడు నే గంతునో ఆత్మప్రియుడా నిన్ను- చూడ ఆశ నాలో కలిగెను
5. నీ ప్రేమ స్వరమున్ విని - నేను మేలుకొంటిని ప్రియుని రొమ్మును చేరను - నాలో వాంఛ ఉప్పొంగుచుండె