పల్లవి:ఆనందము ప్రభు నాకొసగెను - నా జీవితమే మారెనునాయుల్లమందు యేసు వచ్చెన్ - నా జీవిత రాజాయెను (2)
1. ప్రభుని రుచించి యెరిగితిని - ఎంతో ఎంతో ప్రేమామూర్తి విశ్వమంతటినే గాంచలేదు - విలువైన ప్రభు ప్రేమను
2. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ - విజయము పొంద బలమొందెదన్ ప్రభువుతో లోకము జయించెదన్ - ఆయనతో జీవించెదన్
3. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి - పైకి ఉప్పొంగి యెగయుచుండె నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్ - నూతన జీవమొసగెన్