CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 774

నీ దేవుని సన్నిధిని కనబడను

nee devuni sannidhini kanabadanu

Amos 4:12

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ దేవుని సన్నిధిని - కనబడను నీవు సిద్ధపడుమా (2)
1. నీ యౌవనములో - నీ హృదయమును - సంతృప్తిగా - నుండనిమ్ము (2) అయితే వీటిని బట్టి దేవుడు - తీర్పులోనికి - తెచ్చు నిన్ను (2)
2. దుర్దినంబులు రాకముందే - వాటిలో సంతోషము లేదని చెప్పుసమయము రాకమునుపే - సృష్టికర్తను స్మరియించుమా
3. నీ యౌవన జీవితమును బట్టి - తృణీకారము నొందకుమా ప్రభువును బోలి నడచుకొనుమా - మాదిరి కరముగా జీవించుమా
4. వినయ విధేయత కలిగి యుండి - ఒకరి నొకరు యోగ్యులుగా మన్నన చేయుచు పరుల కార్యముల - స్వకార్యముల వలె భావించుమా
5. ప్రేమ సంతోష సమాధానము - దీర్ఘ శాంత దయాళుత్వము మంచితనము సాత్వీక విశ్వాసము - కలిగి యుండి జీవించుమా
6. మేలు చేయుట యందు నీవు - విసుగక యుండుము యెల్లప్పుడు సహనముతో ప్రభు సేవ చేసిన - ఫలము ననుభవించెదవు
7. హల్లెలూయా పాటలు పాడుచు - ఎల్లప్పుడు ప్రభు రాకడకై ఉల్లమునందు సంతసించుచు - పాడుము ప్రభునకు హల్లె లూయా

Back to Hebron Seeyonu Geethalu