CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 773

మనకు జీవమైయున్న

manaku jeevamaiyunna

Colossians 3:4

More
Reference recording on YouTube ↗
పల్లవి:మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2)
1. దేవుని దీవెనలు పొంద (2) యౌవనులార యేసుని సన్నిధికి రారండి (2) దైవకుమారుడు పావన క్రీస్తుని జీవము పొంది నడువుడి (2)
2. యేసు నంగీకరించెడి వారి పేరులు జీవగ్రంథమునందు - వ్రాయబడున్ నమ్మకమైయున్న పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి
3. దేవుని స్వరూపము కల్గిన యేసు ప్రభు మనుజరూపంబున జన్మించెను చావును గెల్చిన పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి
4. యేసు రక్తములో కడుగబడిన తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి గొప్ప కృపానిధి పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి
5. క్రీస్తు యేసుని యౌవన జనమా ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి సత్యరూపియగు పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి
6. రాజుల రాజు ప్రభుల ప్రభువు అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్ సర్వశక్తిగల పావన క్రీస్తుని - జీవము పొంది నడువుడి
7. ప్రభుని పిలుపు పొందియున్న యౌవనులార విశ్వసించి విజయము పొందుడి శత్రువు నోడించి యేసు నామమున - హల్లెలూయ పాట పాడుడి

Back to Hebron Seeyonu Geethalu