CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 765

నా సర్వమైన ప్రభూ

naa sarvamaina prabhoo

Romans 12:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై -అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై (2)
1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు (2) అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా (2) జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత (2)
2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత
3. నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత (2)

Back to Hebron Seeyonu Geethalu