పల్లవి:ప్రభు యేసుని నేను వెంబడింతును (2)తన అడుగు జాడలలో నడిచెదను (2)
1. లోకమున్ విడిచి సిలువను మోసి (2) - దీక్షతో ప్రభుని వెంబడింతును (1)
2. కాపరి యేసు స్వరమును వినుచు - చూపెడి స్థలముల కేగెదను
3. చీకటి జగతిని తప్పించుకొని - వాక్యపు వెలుగులో వెంబడింతును
4. పాప విశాల మార్గమున్ విడచి - పరుగిడెదను జీవ మార్గమున
5. అంతమువరకు స్థిరముగ నిలిచి - అమూల్యమకుటము పొందెదను