CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 755

మనస్సార కృతజ్ఞత లిడుచు

manassaara krutajnyata liduchu

More
Reference recording on YouTube ↗
పల్లవి:మనస్సార కృతజ్ఞత లిడుచు (2) - ఘనంబు చేయు ప్రభున్ (3)
1. విరివిగ నాశీర్వాదము లొసగున్ (2)- మరువకు యేసుని యుపకారం (2) ధర నీకున్నది దేవునిదే యని (2) - కోరిన ప్రబుకిడు త్వరపడుచు2 ఘనంబు చేయు ప్రభున్ (1)
2. దర్శించిన నీ దయగల ప్రభువునకు - హర్షముతో కొట్లను విప్పి విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు - అర్పించి కొనియాడెదము ఘనంబు చేయు ప్రభున్
3. తనయునిలో మన కన్నియు నిడెను - మనలను ముందే తనకిడెను పానార్పణముగ ప్రభుకర్పించి - కాలంబంతయు గడిపెదము ఘనంబు చేయు ప్రభున్
4. సంతసముగ నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెళకువతో నుండి చింతింపక నిడుటే సరియర్పణ - వింతగు వృద్ధిని పొందెదము ఘనంబు చేయు ప్రభున్
5. పిసినితనంబుగ దోషార్పణ నిడ - వాసము చేయును లేశములు యేసునికి నీ జీవనమియ్యను - శాసనమిదె ప్రభుదని యెరుగు ఘనంబు చేయు ప్రభున్
6. ఘనపరచును ప్రభు - మనస్సారగ నిడ - కానుకగా బలకాలములు మన కెన్నో తన గుణముల నిడి - ఘనమును బలమును ప్రభువొసగున్ ఘనంబు చేయు ప్రభున్
7. మకెదొనియ సంఘము వలె నీకు - సకల ఇక్కట్లుండిననుశక్తికి మించి సాగిన గాని - మక్కువగా నిడి మనమిలను ఘనంబు చేయు ప్రభున్

Back to Hebron Seeyonu Geethalu