పల్లవి:స్తుతియింతుము యేసు ప్రభువా - మా స్తుతికి పాత్రుడా (2)నిత్యం నిన్నే ఆరాధించి (2) - మహిమ పరతుము ఇలలో (2)స్తుతికి పాత్రుడా (1)
1. మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా (2) ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా (1) నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా (2)
2. లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా
3. సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా
4. నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా