CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 72

స్తుతించుడి మీరు స్తుతించుడి

stutinchudi meeru stutinchudi

Psalms 148

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతించుడి మీరు స్తుతించుడి (2)యెహోవా దేవుని స్తుతించుడి (2) -స్తుతించుడి
1. ఓ దూతలారా పరమ సైన్యమా (2) సూర్యచంద్రులారా తారాగణమా (2) ప్రభునే స్తుతించుడి (2)
2. పరమాకాశమా పైనున్న జలమా సృష్టికర్తను స్తుతించుడి - నాథుని స్తుతించుడి
3. మకరములారా అగాధ జలమా అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా - కర్తను స్తుతించుడి
4. పర్వత శిఖర వృక్షములారా మృగ పక్షి ప్రాకు పురుగులారా - కాపరిని స్తుతించుడి
5. భూరాజులారా సర్వ ప్రజలారా అధిపతులు యౌవనులు కన్యకలు - రారాజుని స్తుతించుడి
6. మహోన్నతుండు ఇహ పరములలో ఐశ్వర్యవంతుని స్తుతించుడి - దేవుని స్తుతించుడి
7. ప్రజలెల్లరికి రక్షణ శృంగము ఇశ్రాయేలీయులకు భక్తులకును - తండ్రిని స్తుతించుడి

Back to Hebron Seeyonu Geethalu