1. హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి (1) వల్లభుని చర్యలను - తిలకించి స్తుతియించుడి (1) బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి (1) ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి (1)
పల్లవి:రాజుల రాజైన యేసు రాజు - భూజనులనేలున్ (1)హల్లెలూయ హల్లెలూయ - దేవుని స్తుతియించుడి (1)
2. తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళములన్ - మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని - యేసుని స్తుతియించుడి
3. సూర్య చంద్రులారా ఇల - దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి అగ్ని వడగండ్లారా మీరు - కర్తను స్తుతియించుడి హృదయమును ఒప్పించిన - నాథుని స్తుతియించుడి
4. యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి
5. అగాధమైన జలములారా - దేవుని స్తుతియించుడి అలల వలె సేవకులు - లేచిరి స్తుతియించుడి దూతలారా పూర్వ భక్తులారా - దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి