CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 714

శృంగార దేశము చేరగానే

shrungaara deshamu cheragaane

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇదే నాకు ఆనందము ఆనందము ఆనందమునేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము
1. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్ యేసుని యొద్దను నిత్యము నే - నుండుట మిక్కిలి యాశ్చర్యము
2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి - స్తుతికీర్తనలు పాడుదును || ఇదే నా||
3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును నా యేసు ముఖము చూచుటయే - నిత్యము నాకది యానందము || ఇదే నా||
4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు - కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు - నాత్మతో చూచి సంతోషింతును || ఇదే నా||

Back to Hebron Seeyonu Geethalu