పల్లవి:యేసు మారడు - యేసు మారడు - విశ్వమంత మారినను - మాటతప్పడు (2)
1. యేసుని నిత్యము స్తుతియించెదము - భూమి ఆకాశము సృజించినాడు (2) మనలో దేవుని సంకల్పము - యేసుని బయలు పరచుటయే (2)
2. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో - అందరిని ప్రభు నిర్ణయించెను పొందుగ పిలిచి నీతిగా తీర్చె - సుందరముగా మహిమపర్చు || యేసు ||
3. చేసెను మనలను తన రూపమున - బాసెను పాపముచే నా రూపం యేసులో నొసగె మరల మనకు - వాసిగ కాచును పుత్రులుగా || యేసు ||
4. దేవుని ప్రేమించువారందరికి - భువిలో జరుగునన్ని మేలుకై కావవి ఎన్నదగిన శ్రమలు - భావి మహిమతో పోల్చుటకై || యేసు ||
5. శ్రమయు బాధ హింసయైనను - కరువు వస్త్రహీనతయును ఉపద్రవమైనను ఖడ్గమైనను - ఎడబాపునే ప్రభు ప్రేమనుండి || యేసు ||
6. మరణము జీవమైనను - దేవదూతలు ప్రధానులు అధికారులు మరి ఎవరైనను - ఎడబాపరు ప్రభు ప్రేమనుండి || యేసు ||
7. ఆనాది దేవుని ఆ సంకల్పం - మనలో ప్రభుని బయలుపరప మనవలెను మనపాపములు - పూనికతో పూర్ణ ఐక్యతకు || యేసు ||