పల్లవి:ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు (2)అభయులై నిరపరాధులై యుందురు (2)
1. అంతము వరకు స్థిరపరచు నాయనే (2) ఎంతైన నమ్మదగి యున్నవాడు - స్తుతికి పాత్రుండు (2)
2. శోధనలచే క్రుంగియున్న మీకు బాధలలో శాంతిని యిచ్చువాడు - ఓదార్చువాడు
3. గత జీవితములో తప్పిపోతి రెంతో మితిలేని దేవుని వాత్సల్యత - ఎప్పుడు తప్పిపోదు
4. అవిధేయులై బహు దుఃఖపెట్టితిరి దేవుని కనికరమెంతో గొప్పది - విడిచి పోనిది
5. మీ జీవితములలో వాగ్దానములను సజీవమౌ విశ్వాసము పొంది - చేపట్టుకొనుడి