CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 695

వాగ్దానములు పొందుడి మీలో

vaagdaanamulu pondudi meelo

John 16:24

More
Reference recording on YouTube ↗
పల్లవి:వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడునువిశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
1. ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదా మదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు
2. తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండ మీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు
3. దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండు దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని
4. ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా ఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని
5. యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదు యెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి
6. దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్ను తన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి
7. పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను నేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు

Back to Hebron Seeyonu Geethalu