పల్లవి:ప్రకాశమైన ఆశ్చర్యదేశము (1) -ప్రియుని దేశము - నా ప్రియ దేశము (2)
1. పాపరహిత దేశము - ఏ శాపము కనబడదు (2) నిత్యానందము ఆగని గీతము - ఆకాశమందు హోసన్నా - హల్లెలూయ (1)
2. సూర్యచంద్రులు లేరు - కాని చీకటి కనబడదు దైవకుమారుడు తేజోమయుడు - నిత్యము వెలుగిచ్చును - పగలెప్పుడు
3. పలువిధ బోధలతో - నుండు గుంపుల పేరుండదు యేక కుటుంబము ఒక నాయకుడే - మామయ దేశము - ప్రియులు వెళ్ళు
4. ప్రశ్నలు యేవుండవు - ఎట్టి కలవరమే వుండదు జాతి రంగు భాష భేదము - కలవారెవరు లేరు - ప్రేమే పల్కున్
5. పలువిధ ప్రణాళికలు - పరిపాలించు చట్టములు చెరసాలలును శిక్షయు లేదు - నరుల పరిపాలన - అందుండదు
6. సంత వీదులు లేవు - కర్మాగారములే లేవు ధనికులు దరిద్రులు - చిన్నలు పెద్దలు - అను భేదము లేదు - అందరు సమం
7. యేసుని రక్తమందు - పాపం కడిగిన చేరుదువు ఈ గొప్పధన్యత - పోగొట్టుకొను వా - రెవరును కావలదు - నేడేరమ్ము