CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 683

ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు

prabhu yesukreestuni darshaname nedu

Isaiah 6:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు (1)- ప్రజలందరి కత్యవసరము ఆ ఆ (2)
అను పల్లవి:దర్శనము లేక ప్రజలు నశింతురు (1) - దీనినక్కరతో గమనించెదము (2)
1. యెషయాచూచె సైన్యముల యెహోవాను (1)- ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ (2) యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు (1) దూతల గొప్ప ద్వని వినెనపుడు (2)
2. యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె - నా భాగ్యమెవరికి లేదా నాళు ముఖములతో నాలుగు జీవులు కన్నులతో నిండియున్న చక్రములు
3. శాశ్వత రాజ్యములు కల్గిన రాజును - అగ్నివంటి సింహాసనమున్ కోట్లకొలది జనులు తీర్పునకై కాచియుండుట చూచెను దానియేలు
4. కొండపై యేసు రూపాంతర మొందిన - సందర్భము మరువగలమా భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్ ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె
5. పత్మాసు ద్వీపమున యోహానుజూచిన - ప్రభువే సంఘమునకు శిరస్సు మహా ప్రధాన యాజకుడాయనే మహిమ ప్రభావ రూపుడు యేసే
6. సింహసనము మధ్యలో నున్నవాడే - సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల ఆరాధింపబడు దేవుడు నాయనే అందరి యారాధన లాయనకే
7. తెల్లని యశ్వముపై నున్న వీరుడు - నమ్మకమగు సత్యరూపి దేవుని వాక్యము న్యాయాధీపతియగు జీవుల దేవునికే హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu