CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 660

ఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజ

o yesu bhaktulaaraa mee raaju dhvaja

More
Reference recording on YouTube ↗
1. ఓ యేసు భక్తులారా - మీ రాజు ధ్వజము గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ విశ్వాసులారా, రండి - మీ రక్షణార్థమై ప్రయాసపడ్డ యేసు - విజయమిచ్చును
2. మీ యందసూయబట్టి - మీ ఆత్మ నాశనము నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు మీ రెల్ల రేసు పేరు - వచించి యాయనే సర్వాధికారి యంచు - సేవింపవలెను
3. ప్రచండమైన దండు - పోరాడ లేచినన్ విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ స్వకీయ శక్తిగాక - శ్రీ యేసు నామమున్ స్మరించి వానియందు - విశ్వాస ముంచుడి

Back to Hebron Seeyonu Geethalu