పల్లవి:ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను (1)ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును - ఘన విజయమిచ్చును (2)
1. ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ - మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం (1)
2. దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు - లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం
3. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ - శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం
4. అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము - అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం
5. జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ - దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం