పల్లవి:ఉన్నత స్థలములపై - నెక్కించి చూపించు ప్రభు (2)ఎన్నతగిన మహారక్షణ శిఖరము - సుందర మొందు సదా (2)
1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె (2) మరణపు ముల్లును విరచి జయంబును (1) యేసు అనుగ్రహించెన్ ఆ ...2
2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి - సంతస మొందెదరు ఆ ...
3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును నిశ్చయముగా బహు బుద్ధివివేకము - లిచ్చి నడుపు సదా ఆ ...
4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును వంచనలేక వాక్యమునకు - తలవంచి విధేయులౌదురు ఆ ...
5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను నడువుడి త్రోవయిదే యను శబ్దము - చెవులకు వినబడును ఆ ...
6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి రక్షణ కర్త యెహోవా నిన్ను- కాచి రక్షించు సదా ఆ ...
7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు అందమైన యా పరలోక రాజ్యము - ప్రబలుట చూచెదవు ఆ ...