పల్లవి:ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము (1)ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము (1)ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము (1)
1. సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడు (2) సర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్ (2)
2. జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకు నన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్
3. పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చి మందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్
4. కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంత తెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్
5. ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలో ప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా
6. నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసు నీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ
7. ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్ ప్రతిచోట నీవు ఫలముల్ - ఫలించుచుండు మిలన్