CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 622

మాకనుగ్రహించిన దైవ వాక్యములచే

maakanugrahinchina daiva vaakyamulache

Ephesians 1:17-19

More
Reference recording on YouTube ↗
పల్లవి:మాకనుగ్రహించిన దైవ వాక్యములచే -మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా (2)
అను పల్లవి:రక్షణ నొందిన వారికి దేవుడు (2)- ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము (2)
1. రక్షణ కృపలు ప్రభువిచ్చినవే (1)- అతిశయింపలేము అంతయు కృపయే (2) అమూల్యమైన సిలువశక్తిచే (2) ఖాళీయైన మమ్మును నింపె (1)
2. పాప మృతులమైన మమ్మును లేపెను - ప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెను పరలోక పదవి పాపులకిచ్చె పునరుత్థాన శక్తిచే కలిగె
3. మరణ పునరుత్థాన మందైక్యతచే - బలాతిశయమున్ పొందెదము విశ్వసించు మనలో తన శక్తి యొక్క మితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము
4. సర్వాధికారము ఆధిపత్యముల కంటె - శక్తి ప్రభుత్వము లన్నిటికంటే అన్ని నామములలో హెచ్చింపబడిన యుగ యుగములలో మేలైన నామమున
5. తనశక్తిని బయలుపరచుటకు - ఏర్పరచుకొనెను బలహీనులను ఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకు నీచులైనవారిని ఏర్పరచుకొనెన్
6. యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవి - మానక ప్రభువు విధేయులమగుటే దుర్గములన్నిటిన్ పడగొట్టు నదియే ప్రభు యేసు వొసగిన భాగ్యము యిదియే

Back to Hebron Seeyonu Geethalu