పల్లవి:నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్ (1)ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్ (2)
1. మలిన వస్త్రములతో నేను (1)- చెడిన హృదయముతో నేను (2) కలువరి సిలువను చేరన్ (2)
2. మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి
3. నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను నా ప్రభు నా మొర వినును
4. యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు సాధువులను గాపాడున్
5. మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను నా ప్రభునే స్తుతియింతున్
6. యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను జూపించన్ బహుప్రియమున నన్ బిలచెన్