పల్లవి:నీ సన్నిధి చేరితిమి (2) - ప్రభువా ప్రార్థన వినుమా (1)సన్నిధి చేరితిమి ప్రభు నీ సన్నిధి చేరితిమి (2) - నీ సన్నిధి చేరితిమి (1)
1. భారములతో వచ్చితిమి ప్రభువా2 - దృఢనమ్మికతో వచ్చితిమయ్యా2 హృదయాలోచన లెరిగినవాడా (2) - మా మనవిని వినుమా (1)
2. ఆత్మతో నీకే మొఱపెట్టితిమి - నీ చిత్త మెరిగి ప్రార్థించితిమి అడుగక మునుపే మొఱ వినువాడా - మా మనవిని వినుమా
3. మా మధ్యకు రారమ్ము మా ప్రభువా - రక్తముతో మము శుద్ధీకరించుమా శత్రుని శక్తిని బంధించు ప్రభువా - మా మనవిని వినుమా
4. కాంక్షించితిమి దీవెనలొంద - రక్షించుము ఆత్మలను ప్రభువా నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు - మా మనవిని వినుమా