పల్లవి:విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని -విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము (1)
1. ఏకీభవించి భువిపైన యిద్దరు (2)- వేడుకొను సంగతులను గూర్చి (2) నా తండ్రివలన దొరుకునని (2)- నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా (2)
2. ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము
3. పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును
4. నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా
5. ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో అందరి మధ్యనుండే ప్రభువా - రమ్ము మా మధ్యకు నేడే