పల్లవి:జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము - వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము
1. సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము
2. ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము || జీవింప||
3. ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు || జీవింప||
4. ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్ || జీవింప||
5. వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్ || జీవింప||
6. ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు || జీవింప||
7. హల్లెలూయ పాడను - మరుపులు తొలగును శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్ || జీవింప||