1. ప్రీతిగల మన యేసు - ఎంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత - హత్తుచు బ్రేమించును క్రీస్తునొద్ద మన భార - మంత నప్పగించినన్ శక్తిగల యేసు చేత - మోత లెల్ల వీడును
2. నీతిగల మన యేసు - ధృతిగల మిత్రుడు మృతి బొంది కృపతో - వి - శ్రాంతి కలిగించెను భీతి నొందు బాపులైన - జింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తిచేత - క్రొత్తగతి జూతురు
3. దయగల మన యేసు - ప్రియమైన మిత్రుడు మాయ లోకమందు నిజా - శ్రయుడై కాపాడును భయ దుఃఖ శ్రమలాది - మోయరాని బాధలన్ జయ మొప్ప నోర్చి యేసు - స్థాయి వృద్ధి చేయును
4. ధరణిలో యేసుగాక - వేరుగొప్ప మిత్రుడా! పరలోకమందు నింక - పరమ రక్షకుడా! నరులను గావ వేగ - గ్రూరహింస పొందుచు కరుణించి నిల్చి ప్రతి - ప్రార్థనాలకించు