CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 575

పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము

paramatandri karamuletti stutula narpintumu

Isaiah 40:31

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము (1)శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి (1)ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ (2)
1. పాప శాపములందు మేము - పడి చెడి యుండగా (2) దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి (2) ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము (2)
2. దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి కేవలము శరీరులమని - కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము
3. నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము
4. సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు అయితే నీకై చూచు మేము - బలము నొందెదము
5. సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము
6. శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము
7. గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్ నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు

Back to Hebron Seeyonu Geethalu