CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 535

ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ee loka yaatralo ne saaguchunda

Philippians 3:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2) - ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు (2)అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2)
1. జీవిత యాత్ర యెంతో కఠినము (2) - ఘోరాంధకార తుఫాను లున్నవి (2) అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2) కాయువారెవరు రక్షించేదెవరు (2)
2. హృదయము శుద్ధి పరచుకొన్నాను - నా చేతులెంతో పరిశుద్ధ పరచ అనుకొనని రీతి అపవాదివచ్చి నా జీవితమును నిరాశపరచె
3. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా - అనుదినము నన్ను ఆదరించెదవు నీతో వున్నాను విడువలేదనెడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను
4. ఈ అనుభవముతో నేనడచు కొందు - ప్రియ యేసు వైపు నేను చూచుచు గతమునంత నేను మరచిపోయెదను కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు
5. తోడైయుండెదవు అంతము వరకు - నీవు విడువవు అందరు విడచినను నూతన బలమును నా కొసగెదవు నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే

Back to Hebron Seeyonu Geethalu