పల్లవి:ఇమ్ముగనడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభుఇమ్ముగనడిపించితివి (1)
1. మా కున్నస్థలము ఇరుకనియు నీకు మొరలిడగా (2) మరియొకస్థలము మాకొసగితివి (2) - నీకృపకై స్తుతులు (2)
2. బలపరచి మరిధైర్యము నిచ్చి అభయము నిచ్చితివి ఇల నీ మందిరమును నిర్మింప - జనులను కూర్చితివి
3. ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత సకల దేశ నివాసులయందు - భాసిల్ల గోరితిని
4. మీ మధ్యలో నాఆత్మ యున్నదని సెలవిచ్చిన యేసు ప్రభువా మాకు తోడైయుండి - పనిజరిగించితివి
5. పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి ఎష్కోలు ద్రాక్షాఫలములుగ - ఫలియింప గోరితివి
6. అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై గుర్తించిరిగా నీ అద్భుతములు - దేవా స్తోత్రములు
7. వెండి బంగారము లన్నియు నీవి దండిగ నిచ్చెదవు మెండుగ నీదు మేలుల కొరకై - హల్లెలూయ పాడెదము