1. దైవ ప్రేమ పృథ్విలోని - యన్నిటిని మించును ఏసు మాలో నివసించు - మది మా విముక్తియే నీ కమూల్య ప్రేమయుండు - నీవు ప్రేమమూర్తివే నీ దాసులమైన మమ్ముఁ గృపతో రక్షించుము
2. మమ్ము సంరక్షించు శక్తి - నీకుండు మా ప్రభువా యెన్నఁ డెన్నఁ డేని నీదు - సన్నిధిని బాయము నిన్ స్తుతించుచుండి మేము - సర్వదా సేవింతుము నిన్ బ్రార్థించి పూర్ణ ప్రేమ - మే మతిశయింతుము
3. క్రొత్తగా మమ్ము సృజించి పాపమెల్లఁ బాపుము మాకు స్వస్థత నొసంగి - గొప్ప రక్షణ జూపుము భక్తి యభివృద్ధి పొంది - స్వర్గమందుఁ జేరఁగా వింతనొంది ప్రేమ స్తుతి - నీ కర్పింతు మెపుడు