పల్లవి:వారు ఆయన తట్టు చూడగానే (2) - వారికి వెలుగు కలిగెను (2)
1. కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు - కాపాడును మనల ప్రతి శోధన నుండి (2) చూపించు తన మహిమ నిత్యము మనకు (2) స్థాపించును మనలను తన రాజ్యముగా (2)
2. కనుగొంటివా నీవు దేవుని మహిమ - తన కుమారుడైన యేసు ప్రభువులో తన ప్రజలను విడిపింప క్రీస్తేసు తనయుండై యిహమున జన్మించెను
3. అంత్య దినంబు వచ్చుచుండెను చూడు - చింతించెదరు పాపులందరిలలో చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా వింత రక్షణను పొంది ఆనందింతువు
4. యెహోవా తేజస్సు ఆయన శక్తితో - మహిమతో మందిరము నిండి యుండెను మహామహుని పాదముల నేడే వేడిన మహిమానందము పొంది సంతసింతువు
5. క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని - నీతి సూర్యుడు ఉదయించును మెండుగా అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును నిత్యము సంతోష గానము చేతురు
6. రక్షింపబడిన ప్రభుని జనమా - రక్షకుడేసుని స్వకీయ ధనమా రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము