CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 512

మనమేసుని వారలము

manamesuni vaaralamu

John 1:14

More
Reference recording on YouTube ↗
పల్లవి : మనమేసుని వారలము - తనవారిగానే యుందుముమనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము
1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెనుకనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలోతన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము|| మనమేసుని ||
2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెనుమనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనేప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము|| మనమేసుని ||
3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడుదేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహముఆయన మందిరములో - తన మహిమను పాడెదము|| మనమేసుని ||
4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెనుపిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెనుతన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము|| మనమేసుని ||
5. పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చునుకనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరుతన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము|| మనమేసుని ||
6. మహిమ నివసించు మహిమ రాజ్యంబుమహిమతో నిండి యుండునుమన ప్రభువే దీపమై యుండునుతన వెలుగు ప్రచురమగున్యుగయుగములు మనమంతాప్రభుయేసుతో నుండెదము|| మనమేసుని ||

Back to Hebron Seeyonu Geethalu