1. దేవసమాధానం శాంతివలె - ప్రవహించుచుండు వరదరీతి మెండుగాను పారుచుండు నిత్యము - నిండులోతుగాను వృద్ధియగును
పల్లవి:దివ్య యేసు మీద నానుకొందుము -నిత్య విశ్రాంతిని పొందియుందుము
2. చేతినీడ క్రింద నన్ను దాచెను - శత్రుభయముచే దిగులొందను కాపాడును చంచలము రానీక - కించిత్తేని దుఃఖ పడనీయడు ||దివ్య||
3. నీడవలెనుండు దుఃఖక్లేశమున్ - సూర్యజ్యోతియైన తన కృపచే పారద్రోలి నిత్యానంద మిచ్చును - కాన జీవితము సఫలమగున్ ||దివ్య||