CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 479

నాథా! సమూయేలు రీతి నీయామోద శబ్దము

naathaa! samooyelu reeti neeyaamoda shabdamu

1 Samuel 3:10

More
Reference recording on YouTube ↗
1. నాథా! సమూయేలు రీతి - నీయామోద శబ్దము (1) సేవకుడనైన నన్ను - నిప్పుడాలకింపని (1) నాతో నీవేమందువో - నేనాలించువాడనే (1)
2. నీ మాట గ్రహించునట్లు - దాని దేటపర్చుము నిన్ను వెంబడించునట్లు - నిబ్బరింప జేయుము1 నేను నీదు గొఱ్ఱెను - బండనీడల్ మేపుము
3. నేను స్వల్ప శిష్యుడను - నన్ నిరాకరింపకు నిన్నాలింప ఎంతయాశ - నీ వెరింగియుందువు ఆత్మ యక్కరల్ తీర్చు - ధన్యుడన్ నే నౌదును
4. నాథా! నీ శబ్దమాలింప - నన్ను సిద్ధపర్చుము నీదు మాట లక్ష్యపెట్టి - నిత్య సేవ జేయనీ నాతో నీవే మందువో - నేనాలించువాడనే

Back to Hebron Seeyonu Geethalu