పల్లవి:యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాకకృపయు సమాధానము నీకు కలగ జేయును
1. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదాసుని మీద నీదు కృపతో నన్ను - దేవా రక్షింపుము
2. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదు జనులకును చెరలోనుండి మమ్ము - ప్రభువా విడిపింపుము
3. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదు దాసునికి నీ కట్టడలను గూర్చి - ప్రభువా బోధింపుము
4. నీముఖకాంతి ప్రకాశింపజేసి - శిధిలంబైయున్న నీ పరిశుద్ధ స్థలమున్ - దేవా కట్టుమయ్యా
5. నీముఖకాంతి ప్రకాశింపజేసి - పూర్ణశాంతితో నీపై మనస్సుంచి యున్న - వానిన్ కాపాడుము
6. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నిలుపు సమాధానము కావలి యుండుము ప్రభువా - హృదయ తలుపులకు
7. నీముఖకాంతి ప్రకాశింపజేసి - క్షేమమును నదిగా సాగర తరంగము వలెనె - నితీన్ స్థాపించుము