పల్లవి:ప్రభు ప్రజలారా - రయమున రండి (1)యాకోబు వంశమా - స్వకీయ జనమా (1)యెహోవా వెలుగులో - నడుతము రండి (2)
1. అంత్య దినములందు - పొంతన లేనట్టి (2) మందిర పర్వత - శోభను గాంచగ (2) ఉన్నత పర్వత - శిఖరమందుండి (2) మహిమతో యిమ్మహి - వర్థిల్లును (2)
2. యెహోవా మందిర - మందున బోధించు హితబోధను విని - తన త్రోవ నడువగ యాకోబు దేవుని - నివాసమునకు పంక్తులై జనులు - పరుగిడి వత్తురు
3. యెహోవా వంతు ఆయన జనమే యాకోబే తన - స్వాస్థ్యం బాయెన్ భీకర యెడారిలో - కనుగొనె వానిని ఎంచెను కాచెను - కనుపాపగను
4. కమనీయంబగు - కలకని యాకోబు గాంచెను నిచ్చెనన్ - భువినుండి దివికి నిలువగ యెహోవా - దానికి పైగా బేతేలే యిది - వేరేది కాదనెన్
5. దేవుని మందిర - ప్రత్యక్షతలు సజీవ్ సంఘ - మందున నింపెన్ సత్యమునకు నిది - ఆధారమును స్తంభము గానై - స్థిరముగ నుండెను
6. నూతనమైనట్టి - యెరూషాలే మది నిత్య దేవుని - నివాసమాయె భక్తులు చేరి - ప్రస్తుతింపగ స్తుతులకు మధ్యను - ప్రభవించును ప్రభు
7. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును నరహంతకులును - విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి - జరిగించు ప్రతివాడునట - వెలుపట నుందురు
8. సర్ప సంతానము నుండి - వేరైనవారై క్రీస్తుని రక్తమున్ - కోరి వేడినచో స్వకీయ ధనమౌ - యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ - హల్లెలూయ