CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 461

పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము

parishuddha pattanamu krotta yerooshalemu

Revelation 21:1-17

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము - పరము నుండి వచ్చుట చూచితిని (1)భర్త కొరకు అలంకరింపబడిన - పెండ్లి కుమార్తెగా చూచితిని (2)
1. సింహాసనమందు గొప్ప శబ్దముతో - బలముగ పలికిన స్వరము వింటిన్ (2) దేవుడు నివసించు మానవులతో తానే వారితో సదా వసించున్ (1)
2. దేవుడు తానే వారితో నుండి - ఆయన వారికి తండ్రియగును ప్రతి బాష్పబిందువుల తుడిచివేయున్ మరణము దుఃఖము ఏడ్పు నిక నుండదు
3. మొదటి సంగతులు గతించు చుండె - పరికించుము సర్వము క్రొత్తవాయె సింహాసన మందుండి ప్రభువే పలికె నూతనముగా నే చేసితి ననెను
4. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము - సత్యమై మారనిదై యుండు నెప్పుడు ఆది యంతము అల్ఫా ఓమేగ దప్పి గొన్న వానికి జలము లిచ్చున్
5. జయించువారు వీటన్నింటిని - వారసులై స్వతంత్రించు కొందురు ఆయన వారికి దేవుడై యుండి - వారాయనకు పుత్రులవుదురు

Back to Hebron Seeyonu Geethalu