CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 460

క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున

kreestesu prabhuvu tanaraktamichi konnatti sanghamuna

Acts 2:42

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున (1)యెవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది (2)
1. ప్రభుని వాక్యమును సంతోషముతో - ఎవరు స్వీకరింతురో (2) ప్రకటించెదరు తమ ఐక్యతను - బాప్తిస్మమునందు (2)
2. అపొస్తలుల బోధను నమ్మి - స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు యెల్లప్పుడు - సంఘములో నిలిచెదరు
3. పరశుధ్ధులతో సహవాసమును - ఎవరు కలిగియుందురో వారే పొందెదరు క్షేమాభివృధ్ధి - క్రీస్తేసు ప్రభువునందు
4. ప్రభుదేహరక్తమును తినిత్రాగువారే - తనయందు నిలిచెదరు ప్రకటించెదరు ఆయన మరణ - పునరుత్థానమును వారు
5. పట్టువదలక సంఘముతో కూడి - ఎవరు ప్రార్థించెదరో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు - బంధించెదరు వారే
6. క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు - ఎవరెదురు చూచెదరో నిత్యానందముతో సాక్షమిచ్చెదరు - సర్వలోకమునందు

Back to Hebron Seeyonu Geethalu