CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 455

ఈ సంఘపు బునాది క్రీస్తేసాధీశుడే

ee sanghapu bunaadi kreestesaadheeshude

1 Cor 3:12

More
Reference recording on YouTube ↗
1. ఈ సంఘపు బునాది - క్రీస్తేసాధీశుడే దక్కించె యేసు దీని - వాక్కాపుల్ రెట్టించే పై నుండి వచ్చి యేసు - పెండ్లాడె నీమనే కోరుచు రక్తమిచ్చి - కొనె నీ కన్యనే
2. ఒక్కడే దేవుడిందు - ఒక్కటే మార్గము ఒక్కటే జన్మ మిందు - ఒక్కటే సత్యము ఒక్క ప్రసాదమిందు - ఒక్క కష్టంబులే నిరీక్షణొక్కటిందు - నిరంత ప్రాప్తికే
3. అసత్య మార్గమంచు - ననేకుల్ నవ్వినన్ విభాగమై శ్రమంబుల్ - విశేషమొందినన్ సుభక్తుల్ వేడ్రుచుంద్రు - అభయకాంతికై యా నిందలెల్ల బోయె - నానంద నాటికై
4. కఠిన దుఃఖ బాదల్ - కలిగిన నోర్చుచు విభవానంద ప్రాప్తి - లభింపగోరుచు ఆ స్వర్గ పంక్తిజేరి - యానంద మొందుచున్ యీ సంఘ మేసు గూడి - విశ్రాంతి బొందును

Back to Hebron Seeyonu Geethalu