CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 429

పాపిని నేను తప్పితి

paapini nenu tappiti

Matthew 14:31

More
Reference recording on YouTube ↗
పల్లవి:పాపిని నేను తప్పితి - భువిలో రక్షించెడి వారెవరు (1)ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని (2)
1. ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి (2) దౌర్భాగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను (2)
2. జీవము నివ్వ వచ్చితివి - చచ్చి యుంటి నేను బంధింపబడితిని మరణ బంధముతో - విడిపించెడి వారెవరు
3. జన్మముతోనే అపవిత్రుడను - నా స్వభావమే క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని
4. స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్య కార్యములు ఆచారములతో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు
5. భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై
6. ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చుచున్నాను నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణకర్త వీవే

Back to Hebron Seeyonu Geethalu