CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 427

జీవపుదాత నా హృదయములోనికి రా

jeevapudaata naa hrudayamuloniki raa

Psalms 51:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:జీవపుదాత నా - హృదయములోనికి రా (1)నూతన వెలుగు నూతన యనుభవ మందరికి నిమ్ము (2)
1. నూతన జన్మమును మా కొసగి - నూతనముగ మము చేయన్ (2) నూతన ఆత్మ హృదయము నిమ్ము - నిను నే స్తుతియింపన్ (2)
2. నూతన వ్యక్తిగచేయుము ప్రభువా - లోకము చూచునట్లు నూతన వస్త్రాహారము లిచ్చి - సుందరునిగ చేయుము
3. నూతన వాక్కులను మాకొసగి - నూతన గీతము నేర్పు నూతన రాగమును మా కొసగి - నిత్యము స్తుతి పొందుము
4. నూతన శక్తిని అందరికొసగి - నూతన మార్గము జూపు నీదు మహిమ కొరకై నాకు - నూతన నడకను నేర్పు
5. నూతన పాత్రగను ననుజేసి - నీదు మహిమతో నింపు నూతన ఆయుధముగ మముజేసి - శత్రువును ఓడించు

Back to Hebron Seeyonu Geethalu