పల్లవి:నాదు హృదయపు ద్వారము తెరచెదను (2)- యేసు పాపపు రోగికి నీ వేగతి (2)
1. యేసు చచ్చిన వారిని లేపితివే (2) - మరి కుంటికి కాళ్ళను యిచ్చితివే (2) నేను పాపిని రోగిని నీవేగతి (2) - నాకు దిక్కిక లేదిక వేరెక్కడ (2)
2. ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి - మరి దుష్టుల చెంతను చేరితివి నాదు పాపపు కుష్ఠును పారద్రోలి - పరిశుద్ధత నియ్యుము నీవేగతి
3. యాయీరు కుమార్తెను లేపితివి - మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా నేను చచ్చిన పాపిని శరణు ప్రభూ - నాకు వేరొక మార్గము లేదికను
4. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన - ఆ అంధుని ధ్వనిని వింటివిగా నేను పాపిని అంధుని యేస ప్రభూ - నను దాటకు దిక్కిక లేదు ప్రభూ