పల్లవి:పేద నరుని రూపము ధరించి - యేసురాజు నీ చెంత నిలచే (1)అంగీకరించు మాయనను (2) పేద నరుని రూపము ధరించి (1)
1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె - ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె (2) నింద వేదన శ్రమలను సహించె నేసు - చిందె తనదు రక్తము నీ పాపముకై (1) దీనుడై నిన్ను పిలుచుచుండె (2)
2. తలవాల్చుటకు ఇల స్థలమేలేదు - దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు - ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె పాట్లుపడె నిన్ను విడిపింపను
3. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ - పాపడాగులన్ రక్తముతో కడిగెన్ నీ వ్యాధిని వేదన తొలగించ - నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందె
4. మాయలోకమును నీవు నమ్మకుము - మనుష్యుల మనస్సు మారిపోవు నిల నిత్యదేవుని ప్రేమను నమ్మినీవు - నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో "
5. తామసించెద వేల ఓ ప్రియుడా - ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము ఈ లోకము నీకివ్వని శాంతిని - ఈ దినమే ప్రభువు నీకొసగ ప్రేమతో నిన్ను పిలచుచుండె