పల్లవి:మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు (1)సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు (2)
1. ఆయనే నా కోట - ఆశ్రయము నే - నమ్ముకొను దేవుడు (2) రక్షించు వేటకాని ఉరి నుండి - పాడు తెగులు నుండి (2)
2. తన రెక్కలతో నిను కప్పును నీకు - ఆశ్రయంబగును ఆయన సత్యంబు నీ కేడెమును - డాలునై యున్నది
3. రే భయమునకైనా పగటిలో నెగురు - బాణమునకైనా చీకటిలో తిరుగు తెగులునకైనా - నీవు భయపడవు
4. మధ్యాహ్నములో పాడుచేయు - రోగమునకు భయపడవు నీ ప్రక్కను వేయి మంది పడినను - నీవు భయపడవు
5. నీ కుడిప్రక్కను పదివేల మంది - కూలిపోయినను అపాయము నీ దాపున కేమాత్రము - రాదు భయపడవు
6. భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము - నీవు చూచెదవు మహోన్నతునే ఆశ్రయముగా చేసి - వసించు చున్నావు
7. నీ గుడారమున కపాయము తెగులు - సమీపించదు నీ మార్గంబులలో నిను కాపాడను - దూతలకు చెప్పున్
8. నీ పాదములకు రాయి తగుల నీక - నిన్నెత్తు కొందురు సింహములను నాగుల భుజంగములను - అణగ ద్రొక్కెదవు
9. నన్నెరిగి ప్రేమించె గాన నేను - వాని ఘనపరతున్ నా నామమున మొఱ్ఱపెట్టగా నేను - ఉత్తరమిచ్చెదను
10. శ్రమలో తోడై విడిపించి వాని - గొప్ప చేసెదను దీర్ఘాయువుతో తృప్తిపరచి నా - రక్షణ చూపెదను