పల్లవి:దేవా తరతరములకు మాని - వాస స్థలము నీవే (2)
1. మా దోషములను నీవు నీ యెదుట - నుంచుకొని యున్నావు (2) నీ ముఖకాంతిలో మా - రహస్య పా - పములు కనబడుచున్నవి (2)
2. మా దినములన్ని గడిపితిమి - నీ యుగ్రత భరించుచు నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము
3. డెబ్బది సంవత్సరములేగా - మాదు ఆయుష్కాలము అధిక బలమున్న యెడల యెనుబది - సంవత్సరములగును
4. అయినను వాటి వైభవమంత - ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము
5. నీకే జెందవలసినట్టి భయము - కొలది పుట్టినట్టి నీదు ఆగ్రహ క్రోధ బలము - ఎవ్వరికి తెలియున్
6. మాకు నీ జ్ఞాన హృదయమును - కలుగునట్లు చేయుము మా దినములు లెక్కించుటకు - మాకు నివే నేర్పుము