CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 407

యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము

yerushalemu gummamulaaraa raajunu loniki raanimmu

Matthew 21:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెరూషలేము గుమ్మములారా - రాజును లోనికి రానిమ్ము (1)చిరునవ్వుతో - ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము (2)
1. విజయుడై వచ్చుచున్నాడు - శత్రు సాతానును ఓడించి (2) ఖర్జూర మట్టలు వస్త్రము లెందుకు - మీ హృదయములను పరువుడి (2)
2. అభ్యంతర పరచకుము - పిల్లలు, వృద్ధులు, యౌవనులన్ ప్రభుని విజయమునందు వారిని - స్తుతిస్తోత్రములు పాడనిమ్ము
3. నీ దుష్టక్రియలను బట్టి - ప్రభుని దయము త్రోసెదవా పరమ రాజును హృదయ మందిరమున - నేడే రానిమ్ము స్నేహితుడా
4. నిన్ను దర్శించుటకే - ప్రభు నీ చెంతకు వచ్చెనుగా గాయపడిన హస్తమును చాచి - నీ మదిలో చోటిమ్మనెను
5. పశ్చాత్తాపము నొందుము నేడే - నీ పాపము లొప్పుకొనుము జీవము రక్షణ శాంతి నొసగును - ఆయనే ప్రభువు శ్లాఘించుము

Back to Hebron Seeyonu Geethalu