పల్లవి:ప్రభుయేసు రమ్మనుచుండె - పాపుల నెల్లరిని (2)వచ్చిన వారికి ప్రభుయేసుండే - విశ్రాంతి నిచ్చు (2)
1. లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి (2) దేవుని మహిమకు దూరమైపోయిరి (2) మానవుల నీతి క్రియలు - మురికి పేలికలే (2)
2. ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై మరణము గెల్చి విజయమునిచ్చి - నీతిగా తీర్చె
3. ఎందరు విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ నేడె మీ కనుకూల సమయము - రక్షణ దినము
4. పాపమును క్షమించుటకు - ప్రభుకే అధికారము కలదు ఎవరి పాపదోషములు పరిహరింపబడునో వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా
5. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారేగా తీర్పు మరణము లేక జీవము పొందెదరు పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో